View

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అలా ప్లాన్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్!

Monday,May22nd,2017, 11:05 PM

ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ పడితే... ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనే లెక్కలు వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరి స్టామినా బాక్సాఫీస్ వద్ద ఇంచుమించు ఒకటే. ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కాబట్టి వీరి సినిమాలు ఒకేసారి విడుదలైతే గట్టి పోటీ నెలకొనడం ఖాయం. ఈ ఇద్దరితో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఈ లెక్కలు వేసుకుని వీరి సినిమాలను ఒకేసారి విడుదల చేసేటంతటి సాహసం చేయరు. వసూళ్లు షేర్ అవ్వడం వల్ల లెక్కలు తప్పుతాయి. అయితే ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న చర్చల ప్రకారం ఈ ఇద్దరూ వచ్చే యేడాది సంక్రాంతికి పోటీపడబోతున్నారు.


పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా దసరాకి విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా విడుదలను వచ్చే యేడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారట. కీర్తి సురేష్, అను ఇమాన్యువేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు.


మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' టైటిల్ తో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్నట్నుంచి ఆరంభమయ్యింది. మహేష్ బాబు వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. కాగా ఈ సినిమాని సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 11న విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు.


సో... క్రేజీ ప్రాజెక్ట్స్ తో పవన్, మహేష్ సంక్రాంతి బరిలోకి దిగితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. సినీప్రియులకు కూడా సంక్రాంతి పండగ మంచి కిక్ ఇస్తుంది. మరి ఈ హీరోలిద్దరూ పోటీ పడతారా... వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !