యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి హిట్ చిత్రాలు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందాయి. 'భాహుబలి 2' తర్వాత భారీ బడ్జెట్ తో ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే చిత్రాన్ని చేయడానికి రాజమౌళి, ఎన్టీఆర్ సమాయత్తమవుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ గురించిగానీ, ఎన్టీఆర్ తో సినిమా చేయడం గురించిగానీ రాజమౌళి ఎక్కడా నోరు విప్పడంలేదు.
కాగా తాజా వార్తల ప్రకారం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నాడట ఎన్టీఆర్. ఈ మధ్య తన కోసం ఓ ప్రాజెక్ట్ చేసి పెట్టమని రాజమౌళిని అడిగాడట ఎన్టీఆర్. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో కూడా ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటే, ఎన్టీఆర్ గ్రాఫ్ పెరిగిపోవడం ఖాయం. ఆల్ మోస్ట్ టాప్ ఛైర్ కి పోటీ ఇచ్చే స్థాయికి చేరిపోతాడు. మరి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలనే ప్రయత్నంలో ఎన్టీఆర్ సఫలమవుతాడా వేచి చూద్దాం.