మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఆగస్ట్ 22న ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. ఆల్ రెడీ ఈ సినిమా కోసం మేకోవర్ అవ్వడం కూడా ప్రారంభించేసారు చిరు. గెడ్డం పెంచడంతో పాటు ఫిజిక్ పరమైన మార్పులకు కూడా ట్రై చేస్తున్నారట. ఈ మధ్య గెడ్డంతో ఓ ఫోటో షూట్ కూడా జరిగిందట. ఇంకా గెడ్డం పెరిగిన తర్వాత మరోసారి ఫోటో షూట్ చేయబోతున్నారట. రెండు, మూడు గెటప్ లతో ఫోటో షూట్ చేసి, ఫైనల్ గా ఓ గెటప్ ని సెలెక్ట్ చేయబోతున్నారట.
కాగా తాజా వార్తల ప్రకారం సినిమా ప్రారంభోత్సం రోజునే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' గెటప్ తో ఓ స్టిల్ రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. కాస్ట్యూమ్స్ కూడా డిజైనింగ్ జరుగుతోందట. సో.. ప్రారంభోత్సవమే మెగా అభిమానులు ఓ పండగ అనుకుంటారు.. ఇక ఫస్ట్ లుక్ కూడా అదే రోజున విడుదల చేస్తే... 'అంతకుమించి' ఏం కావాలి చెప్పండి... మెగాభిమానులు సంతోషానికి అంతే ఉండదు.
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం టైటిల్ లోగో 'కాలా' తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసి అందరినీ సంభ్రమాశ్యర్యాలకు గురి చేసారు. ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇదే ఫార్మాలాను ఫాలో అయ్యి, సినిమా ప్రారంభోత్సవం రోజునే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిరు, రాంచరణ్. ఇది మెగాభిమానులకు మంచి కిక్ ఇచ్చే విషయం అని చెప్పొచ్చు.