'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్' చిత్రాలతో వరుసగా ఫ్లాప్స్ ని చవిచూసాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. దాంతో అతని కెరియర్ డైలమాలో పడిపోయింది. తదుపరి సినిమా అవకాశం ఎలా వస్తుంది.. ఏ హీరో అవకాశం ఇస్తాడు.. ఏ నిర్మాత శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయడానికి ముందుకు వస్తాడనే చర్చ ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది.
అయితే తాజా వార్తల ప్రకారం శ్రీను వైట్ల ఓ ప్రాజెక్ట్ ని వర్కవుట్ చేసాడని తెలుస్తోంది. మహేష్ బాబు తో 'దూకుడు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పుడు మైత్రి మూవీ మేకర్స్ శ్రీను వైట్లకు 2కోట్లు అడ్వాన్స్ ఇచ్చారట. ఆ తర్వాత శ్రీను వైట్ల కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడం, శ్రీను వైట్ల వేరే ప్రాజెక్ట్స్ తో ముందుకు వెళ్లడం జరిగిపోయింది. ఆ మధ్య శ్రీను వైట్లను అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని మైత్రి మూవీస్ అధినేతలు అడిగారట. కానీ శ్రీను వైట్ల అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదు. ఈ మధ్య మరోసారి శ్రీను వైట్లను అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని అడిగితే, అడ్వాన్స్ తిరిగి ఇవ్వనుగానీ, ఓ సినిమా చేసి పెడతానని చెప్పాడట. దాంతో ఓ హీరోని సెట్ చేసుకోమని మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు చెప్పడంతో మాస్ మహారాజా రవితేజను పట్టేసాడట శ్రీను వైట్ల. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న సినిమా కాబట్టి, రవితేజ డేట్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అక్టోబర్ లో ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు రూపొందాయి. నాలుగోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. సో... ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ ని చేతిలో పెట్టుకుని నిర్మాతలను లాక్ చేసాడు శ్రీను వైట్ల. మైత్రి మైవీ మేకర్స్ సంస్థ వరుసగా హిట్ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ సంస్థలో సినిమా కాబట్టి, శ్రీను వైట్ల కెరియర్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో వేచి చూద్దాం.