మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం 'రంగస్థలం' చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చెప్పే విషయం ఈ సినిమాకి సంబంధించింది కాదు... రాంచరణ్ గత చిత్రం 'ధృవ' కు సంబంధించినది. ధృవ చిత్రాన్ని హిందీలో డబ్ చేస్తున్నారు. త్వరలో 'ధృవ' డబ్బింగ్ వెర్షన్ ని బుల్లితెరపై టెలికాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా 'ధృవ' హిందీ వెర్షన్ కి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టేసారట. రాంచరణ్ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నారట. మాములుగా అయితే హిందీలో డబ్ అవుతున్న తెలుగు సినిమాలకు రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లతో డబ్బింగ్ చెప్పిస్తారట. కానీ 'ధృవ' కి మాత్రం అలా చేయడంలేదు. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో రాంచరణ్ పాత్రకి డబ్బింగ్ చెప్పించడానికి సన్నాహాలు చేస్తున్నారట. రాంచరణ్ సినిమా కాబట్టి, అజయ్ దేవగన్ కూడా డబ్బింగ్ చెప్పడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సో... 'ధృవ' హిందీ వెర్షన్ ప్రీమియర్ ని గ్రాండ్ గా టెలికాస్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు.