అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం తన రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ గురించి చాలా వార్తలు ప్రచారమవుతున్నాయి. 'జున్ను', 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక', 'రంగుల రాట్నం' టైటిల్స్ ఈ సినిమా కోసం ప్రచారమయ్యాయి. అయితే ఈ టైటిల్స్ ఏవీ అఖిల్ సినిమాకి పెట్టడంలేదు. కింగ్ నాగార్జున తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా కోసం అనుకుంటున్న టైటిల్ గురించి ఓ హింట్ ఇచ్చారు.
''హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం'' అనే పాటను నాగ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ టైటిల్ నుంచే అఖిల్ సినిమా టైటిల్ ఉంటుందని హింట్ ఇచ్చారు నాగ్. అంతే ఎవరికి తోచిన విధంగా వారు టైటిల్ ని అనుకుంటున్నారు. 'హలో', 'ఫ్రేమ కోసమేరోయ్ జీవితం', 'హలో గురూ'... టైటిల్స్ ప్రచారమవుతున్నాయి. అయితే నాగ్, అఖిల్ సన్నిహితుల ద్వారా అందుతున్న వార్తల ప్రకారం 'హలో' టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేసారని సమాచారమ్. మరి ఫైనల్ గా ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా వేచి చూద్దాం. ఇదిలా ఉంటే...
ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి ఆసక్తికరమైన అప్ డేట్ ప్రచారమవుతోంది. 21 యేళ్ల హీరోకి తన చావు ఎప్పుడనే విషయం తెలుస్తుందట. దాంతో తను బ్రతికి ఉన్న సమయంలోపు ఎలాంటి పనులు చేసాడు అనే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా స్టోరీ లైన్ సాగుతుందట. అద్భుతమైన స్ర్కీన్ ప్లే తో, విక్రమ్ కుమార్ మార్క్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారమ్.