మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కాగా చిరు పుట్టినరోజును (ఆగస్ట్ 22) పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ ని గ్రాండ్ గా జరుపుతున్న చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ ఈవెంట్ లో భాగంగా విడుదల చేయబోతున్నారు. ఈ ఈవెంట్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ లో జరగనుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి మోషన్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 9.30 కి ఈ ఈవెంట్ ప్రారంభమవుతుంది, మెగాభిమానులు భారీ ఎత్తున ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ని వర్కింగ్ టైటిల్ గా పెట్టుకుని, అసలు టైటిల్ ని వేరే ఫిక్స్ చేయాలనుకుంటున్నారట. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు కాబట్టి. అన్ని భాషలకి ఒకే టైటిల్ ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారట. 'బాహుబలి' అన్ని భాషల్లోనూ అదే టైటిల్ తోనే విడుదలయ్యింది. సేమ్ టు సేమ్ 'ఉయ్యాలవాడ..' కి కూడా అలానే ప్లాన్ చేస్తున్నారట. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అంటే తెలుగువారికి మాత్రమే కనెక్ట్ అవుతుందని, స్వాతంత్ర సమరయోధుడు జీవిత చరిత్ర కాబట్టి, అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యేట్టు 'మహావీర' టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారని సమాచారమ్. ఈ విషయంలో రేపు క్లారటీ వచ్చేస్తుంది. సో... రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే.