మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఈ చిత్రంలో నటించబోయే నటీనటుల లిస్ట్ ని రివీల్ చేయడంతో ఇప్పటివరకూ కొనసాగిన సస్పెన్స్ కి తెరపడినట్టయ్యింది. ఈ సినిమాకి మొదట్నుంచి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' టైటిల్ అనుకుంటూ వచ్చారు. కానీ ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారనే వార్తలు వచ్చాయి. అప్పట్నుంచి ఈ సినిమాకి టైటిల్ ఏమయ్యుంటుందా అనే చర్చ సాగుతూనే ఉంది.
ఈ రోజు (22.8.2017) చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని, టైటిల్ ని రివీల్ చేసారు. టైటిల్ గా 'సైరా' ని ఫిక్స్ చేసి, ట్యాగ్ లైన్ గా 'నరసింహారెడ్డి' ని ఖరారు చేసారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, నాజర్, రవికిషన్ ఇతర ప్రధాన తారగణం కాగా ఏ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.