మెగాస్టార్ చిరంజీవి 62వ పుట్టినరోజు వేడుకలు నిన్న(ఆగస్ట్ 22) అంగరంగ వైభవంగా జరిగిన తెలిసిందే. ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు భారీ ఎత్తున విషెస్ తెలియజేసారు. బొకేలు, గిఫ్ట్ లకు అంతే లేదు. ఇదంతా ఒక ఎత్తయితే... చిరంజీవి సోదరి, సాయిధరమ్ తేజ్ తల్లి తన సోదరుడికి ఓ గిఫ్ట్ ఇచ్చింది. అదేంటంటే...
తన కొడుకులు వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లతో పాటు చిరుని కలిసిన సాయిధరమ్ తేజ్ తల్లి కరవాలము (కత్తి) గిఫ్ట్ గా ఇచ్చి, చిరుని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసారు. అమృతసర్ కి చెందిన హ్యాండ్ క్రాఫ్ట్ ఎక్స్ షర్ట్స్ తో ఈ కత్తిని తయారు చేయించారట. నిన్న చిరు 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రం ఆరంభమయ్యింది. ఇందులో ఫ్రీడమ్ ఫైటర్ గా నటిస్తున్నారు చిరు. సందర్భానుసారం చిరు సోదరి ఈ గిఫ్ట్ ఇచ్చి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కత్తి పట్టుకుని సోదరి, మేనల్లుడులతో చిరు ఇచ్చిన ఫోజ్ సూపర్. మొత్తం మీద మెగాస్టార్ కి తన సోదరి నుంచి మంచి గిఫ్టే అందింది కదా...!