యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు (21.9.2017) ఘనంగా విడుదలయ్యింది. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతోంది. యు.యస్ రిపోర్ట్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనేలా చేసాయి. ఈ అంచనాలు యు.యస్ బాక్సాఫీస్ వద్ద కూడా వర్కవుట్ అయ్యాయి. సినిమా విడుదల కోసం ఎదురుచూసేలా చేసాయి. ఈ సినిమా ప్రీమియర్స్ కి ప్రేక్షకులు విరుచుకుపడిపోయారు. ఓవర్ సీస్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా హాఫ్ మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టినట్టు రిపోర్ట్స్ అందుతున్నాయి.
ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓవర్ సీస్ లో బెస్ట్ ఓపినింగ్స్ సాధించిన సినిమాగా 'జై లవ కుశ' నమోదు చేసుకుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఆడియన్స్ కి ఫీస్ట్ లా ఉంది. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరుకు జే జేలు పలుకుతున్నారు. ఇదే రేంజ్ లో కొనసాగితే భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం. కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఒకటి, రెండు రోజులు ఆగితే ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందో ఓ అంచనాకు రావచ్చు.