విక్టరీ వెంకటేష్ త్వరలో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 16 న ఈ చిత్రం ప్రారంభంకానుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ తాజా వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. టైటిల్ ని బట్టి వెంకీ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడని చెప్పొచ్చు. ఆట మొదలుపెట్టి, వేటాడి తన టార్గెట్ ని చేరుకుంటాడని కూడా ఊహించవచ్చు. మొత్తం మీద తేజ ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ ఈ సినిమా కోసం సిద్ధం చేసాడని టైటిల్ ని బట్టి అర్ధమవుతోంది. రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి ఇంట్రస్టింగ్ టైటిల్ తో సినిమా చేసి సక్సెస్ కొట్టేసిన తేజ ఈసారి వెంకీతో ఏ రేంజ్ హిట్ కొట్టబోతున్నాడో వేచి చూద్దాం.