బుల్లితెరపై లేడీ విలన్ గా చేసిన భువనేశ్వరి గుర్తుందా? హాట్ లేడీ విలన్ గా చిన్ని తెరపై ఒకప్పుడు హల్ చల్ చేసింది. ఆ తర్వాత వెండితెరపై కొన్ని కీలక పాత్రలు చేసింది. అవన్నీ కూడా గ్లామరస్ కారెక్టర్స్ కావడంతో శృంగార తార అనే పేరు సంపాదించుకుంది భువనేశ్వరి. ఈ వ్యాంప్ నటి ఆ మధ్య వ్యభిచారం నేరంలో పోలీసులకు దొరికిపోయి వార్తల్లో నిలిచింది. తాజా ఆమె కొడుకు చేసిన నిర్వాహ కం భువనేశ్వరిని చిక్కుల్లో పడేసింది.
చెన్నయ్ లోని వలసరవాక్కం, తిరుమలై నగర్ ఏంజిల్ స్ట్రీట్ లో భువనేశ్వరి నివాసముంటోంది. ఆమెకు 23యేళ్ల కొడుకు మిధున్ శ్రీనివాసన్ ఉన్నాడు. ఈ కుర్రాడు లా చదువుతున్నాడు. కాగా ఈ కుర్రాడికి అన్నానగర్ కి చెందిన ఓ అమ్మాయితో ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ షిప్ ఏర్పడిందట. ఈ మధ్య ఆ అమ్మాయిని తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా వేధించడం మొదలుపెట్టాడట మిధున్ శ్రీనివాసన్. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె ఇంటికి వెళ్లి గొడవపడ్డాడట. రకరకాలుగా వేధించడం మొదలుపెట్టడంతో, తట్టుకోలేని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పిందట. దాంతో మిధున్ శ్రీనివాసన్ రెచ్చిపోయి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు కంఫ్లయింట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిధున్ శ్రీనివాసన్ ని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్న మిధున్ శ్రీనివాసన్ గతంలో కూడా ఓ అమ్మాయికి సంబంధించి వివాదంలో ఇరుక్కున్నాడు. కొడుకు చేసిన ఈ నిర్వాహకం భువనేశ్వరికి తలనొప్పిగా మారిందని సమాచారమ్.