నూతన దర్శకుడు చక్రి చెప్పిన ఓ కథ నచ్చి సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతలు దొరకక రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో ఆ డైరెక్టర్ గోపీచంద్ చెంతకు చేరాడు. రవితేజకు చెప్పిన కథకు కొన్ని మార్పులు చేసి, గోపీచంద్ కి చెప్పాడట. కథ నచ్చడంతో గోపీచంద్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ చిత్రాన్ని నిర్మాత రాధామోహన్ నిర్మించనున్నారు. ‘రాబిన్ హుడ్’ టైటిల్ ని పెట్టాలనుకున్నారు. అయితే తెలుగు ఆడియన్స్ కి ఈ టైటిల్ కనెక్ట్ అవ్వదని భావించి టైటిల్ వేరే పెట్టాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే…
రేపు (19.11.2017) ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరగనుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి హీరోయిన్ ఖరారయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుని ముందుకు దూసుకెళుతున్న మెహ్రీన్ కౌర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. సో.. లక్కీ హీరోయిన్ ని రొమాన్స్ చేయబోతున్నాడు గోపీచంద్. కొత్త డైరెక్టర్ ఓ మంచి స్టోరీ లైన్ ని ప్రిపేర్ చేసుకుని కాన్ఫిడెంట్ గా లైన్లోకి దిగుతున్నాడు. మరి ఈ కాంబినేషన్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం.