ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమా కోసం వర్కవుట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వడానికి లేట్ అవుతుంది. సినిమా పూర్తవ్వడానికి, రిలీజ్ అవ్వడానికి కూడా టైమ్ పడుతుంది కాబట్టి, వచ్చే యేడాది చివరి వరకూ ఎన్టీఆర్ సినిమా చూసే అవకాశంలేదు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్న విషయం. అయితే ఫ్యాన్స్ నిరాశపడనవసరం లేదు. వారికి గుడ్ న్యూస్. విషయం ఏంటంటే...
ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షో కి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ షో కి సంబంధించిన సీజన్ 2 ని త్వరలో ఆరంభించబోతున్నారట. ఇప్పటికే ఈ బిగ్ బాస్ 2 కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడట. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆరంభమయ్యేలోపు, బిగ్ బాస్ 2 సీజన్ కి సంబంధించిన షూటింగ్ ని ఎక్కువ శాతం పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇందుకు తగ్గట్టు షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్. కాబట్టి ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా లేట్ అయ్యే అవకాశముందేమోగానీ, ఎన్టీఆర్ ని మాత్రం మిస్ అయ్యే అవకాశంలేదు. బుల్లితెరపై ఎన్టీఆర్ ని చూడొచ్చు.