యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారనే వార్తలు రాంచరణ్ తదుపరి సినిమాలపై దృష్టి సారించేలా చేసింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశంలేదని, రాజమౌళి కోసం రాంచరణ్ డేట్స్ కేటాయించేసాడని వార్తలు ప్రచారమవుతున్నాయి.
అయితే ఈ సినిమాని రాంచరణ్ పక్కన పెట్టేయలేదని, జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ ని ఆరంభించడానికి బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. వచ్చే యేడాది దసరాకి ఈ సినిమాని విడుదలయ్యేలా ప్లాన్ చేద్దామని కూడా బోయపాటి,చరణ్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కాబట్టి బోయపాటి, చరణ్ కాంబినేషన్ సినిమా ఆగిపోయిందనే వార్తలు తప్పుడు వార్తలే. నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీగా నిర్మించాలనుకుంటున్నారట. సో... మాస్ ఇమేజ్ ఉన్న హీరో రాంచరణ్, మాస్ ఆడియన్స్ లో తనకంటూ స్థానం సంపాదించకున్న బోయపాటి కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు.