నాని, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన 'ఎం.సి.ఎ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం వచ్చే శుక్రవారం థియేటర్స్ కి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ఇచ్చిన కట్స్ గురించి ఎలాంటి వార్తలు బయటికి రాలేదుగానీ, ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కొన్ని సీన్స్ కి కత్తెర వేయడం గురించి ఫిల్మ్ నగర్ లో తెగ చర్చించుకుంటున్నారు.
నాని, సాయిపల్లవి మధ్య మంచి రొమాంటిక్ సీన్లు ఉన్నాయట. ఈ సీన్స్ లో సాయిపల్లవి నటన చాలా డామినేటింగ్ గా ఉందట. దాంతో అసలు ఈ సినిమాలో హైలైట్ అవుతాయని భావిస్తున్న సీన్లు కంటే నాని, సాయిపల్లవి రొమాంటిక్ సిన్లు హైలైట్ అయ్యేలా ఉన్నాయట. నిజం చెప్పాలంటే వదిన, మరిది సీన్లు హైలైట్ అవుతాయని భావించారట. వదినగా భూమిక చావ్లా, మరిదిగా నాని అద్భుతంగా నటించారట. ఈ ఇద్దరి మధ్య సీన్స్ చాలా బాగున్నాయట. కానీ సాయిపల్లవి, నాని రొమాంటిక్ సీన్స్ హైలైట్ అయ్యాయట. సాయిపల్లవి ఆ రేంజ్ లో నటించిందట. దాంతో దిల్ రాజు రంగంలోకి దిగి నాని, సాయిపల్లవి మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ కొన్నింటికి కత్తెర వేసాడట. మొత్తం మీద సాయిపల్లవి తన నటనతో అందరినీ డామినేట్ చేస్తోందన్నమాట...!