సంక్రాంతి బరిలో నందమూరి నటిసింహం బాలకృష్ణ దిగితే, ఆ బొమ్మ హిట్టే... రికార్డులు మోత మోగడం ఖాయం... సంక్రాంతి రారాజు బాలయ్య అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. ఈ యేడాది 'జై సింహా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య. కోలీవుడ స్టార్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలుగా నటించారు. చిరంతన్ భట్ సంగీతమందించారు. సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మించిన 'జై సింహా' మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టింది. బి, సి సెంటర్స్ లో 'జై సింహా' వసూళ్లు స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ సినిమాని పంపిణీ చేసిన అన్ని ఏరియాల పంపిణీదారులు సేఫ్ జోన్ లోకి చాలా ఈజీగా వెళ్లిపోతారని ట్రేడ్ రిపోర్ట్స్ అందుతున్నాయి.
జనవరి 12న విడుదలైన ఈ సినిమా నిన్నటివరకూ (15.1.2018) ప్రపంచ వ్యాప్తంగా 19.73కోట్ల షేర్ ని రాబట్టినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్టాల్లో 16.13కోట్ల షేర్ ని రాబట్టగా, కర్నాటకలో 2.40కోట్లు, ఓవర్ సీస్, రెస్టాణ్ ఇండియా 1.2కోట్లు షేర్ ని తన ఖాతాలో వేసుకుంది 'జై సింహా' సినిమా. సో... బాలయ్య సత్తాని మరోసారి 'జై సింహా' నిరూపించింది అని చెప్పొచ్చు.