మెగాపవర్ స్టార్ రాంచరణ్, క్యూట్ బేబి సమంత ప్రస్తుతం 'రంగస్థలం' చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గంగవరం మండలం, సూరంపాలెం రిజర్వాయర్ దగ్గర ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్న ఈ పాట కోసం 30బోట్లును వాడారట. గ్రూప్ సాంగ్ కావడంతో బోట్లు, గ్రూప్ డ్యాన్సర్స్ తో కోలాహలంగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోందట.
కాగా ఈ రిజర్వాయర్ దగ్గర తమ అభిమాన హీరో, హీరోయిన్ సమంత ఉన్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారట. రాంచరణ్ తో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నాలు చేసారట. కానీ లొకేషన్స్ స్టిల్స్ లీక్ అవ్వడం ఇష్టంలేని చిత్రం టీం అభిమానులను షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. కానీ రాంచరణ్ బయటికి రావాలని, అభిమానులు పట్టుబట్టడంతో రాంచరణ్ బయటికి వచ్చి అభిమానులను గ్రీట్ చేసి సెల్ఫీలు దిగాడట. సుకుమార్ తో కూడా సెల్ఫీలు దిగి హంగామా చేసారట. మొత్తం మీద'రంగస్థలం' షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి అభిమానుల తాకిడి భారీగా ఉంటోంది. మార్చి 30న ఈ చిత్రం థియేటర్స్ కి వస్తోంది.