నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'చల్ మోహన్ రంగ'. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నితిన్ 25వ చిత్రం.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ఈ రోజు (11.2.2018) ఉదయం 9 గంటల 30 నిముషాలకు విడుదల చేసారు.
''నా అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం ప్రచార చిత్రాలను ట్విట్టర్ ద్వారా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉంది'' అని తెలిపాడు హీరో నితిన్.
ఈ చిత్రం టీజర్ ను ప్రేమికుల రోజు అయిన ఈ నెల 14న, ఏప్రిల్ 5న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు డైరెక్టర్ కృష్ణచైతన్య.
హైదరాబాద్, ఊటీ, అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క పాటను ఈ 14 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు.