యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ఆరంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ రోల్ చాలా కీలకమట. ఈ పాత్ర కోసం బాలీవుడ్, మల్లూవుడ్, కోలీవుడ్ నటులను తీసుకోవడానికి ప్రయత్నాలు చేసిన త్రివిక్రమ్ ఫైనల్ గా మన టాలీవుడ్ నటుడినే ఎంపిక చేసాడు. ఈ నటుడు ఎవరో కాదు... హీరో జగపతిబాబు.
ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటించాడు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు జగపతిబాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జగపతిబాబు నటించలేదు. ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. మరి జగపతిబాబు కోసం త్రివిక్రమ్ ఎలాంటి పాత్రను క్రియేట్ చేసాడో వేచి చూడాల్సిందే.