మామ, మేనల్లుడు వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో సినిమా చేయడానికి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసాడు. కానీ ఈ సినిమా వర్కవుట్ అవ్వలేదు. తాజాగా ఈ కాంబినేషన్ తో సినిమా చేయడానికి మరో డైరెక్టర్ రంగం సిద్ధం చేసాడని తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' లాంటి హిట్ చిత్రం చేసిన డైరెక్టర్ బాబి నెక్ట్స్ సినిమా ఇంకా ఆరంభమవ్వలేదు. తాజా వార్తల ప్రకారం అక్కినేని హీరో నాగచైతన్యకు డైరెక్టర్ బాబి ఓ స్టోరీ లైన్ చెప్పాడట. ఈ స్టోరీ లైన్ నాగచైతన్యకు బాగా నచ్చిందట. పైగా స్టోరీ లైన్ ప్రకారం ఓ సీనియర్ హీరో ఈ సినిమాలో నటించే అవకాశం ఉందట. దాంతో మేనమామ వెంకటేష్ తో కలిసి ఈ సినిమాలో నటించాలని నాగచైతన్య భావించాడట. వెంకీకి ఈ విషయం తెలియడంతో తను కూడా కథ విని ఈ సినిమాకి మేనల్లుడితో కలిసి తెర పంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకటేష్. ఈ సినిమాని నిర్మించే అవకాశం దగ్గుబాటి సురేష్ తన భుజాల మీద వేసుకున్నాడు. సురేష్ బాబుతో కలిసి మరో నిర్మాత కూడా ఈ సినిమాని నిర్మించే అవకాశముందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ఫిల్మ్ నగర్ సమాచారమ్. సో... మేనల్లుడు నాగచైతన్య కోసం మేనమామలు సురేష్ బాబు, వెంకటేష్ రంగంలోకి దిగుతున్నారన్నమాట...!