యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బిగ్ బాస్' సీజన్ 1 షో ని సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసి బుల్లితెర ఆడియన్స్ ని అలరించాడు. సెకండ్ సీజన్ ని కూడా ఎన్టీఆర్ తోనే హోస్ట్ చేయించాలని నిర్వాహకులు భావించారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు అంగీకరించిన ఎన్టీఆర్ 'బిగ్ బాస్ - 2' ని హోస్ట్ చేయడానికి ఇష్టపడటంలేదట.
కాగా తాజా వార్తల ప్రకారం హీరో నానితో 'బిగ్ బాస్ - 2' షో ని హోస్ట్ చేయించాలని నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. ఎన్టీఆర్ తర్వాత నాని మాత్రమే ఈ షో ని సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేయగలడని భావిస్తున్నారట. అందుకే నానితో సంప్రదింపులు జరుపుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన ఈ షో ని హోస్ట్ చేయడం వల్ల తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట నాని. అందుకే ఈ షో హోస్ట్ చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది.