నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్టీఆర్ బయోపిక్' తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు మరో సినిమా చేయడానికి కూడా బాలయ్య సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయ్యిందట.
మే 2న ఈ సినిమా ప్రారంభోత్పవ కార్యక్రమాన్ని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ఆరంభమవుతుందనే విషయం తెలియాల్సి ఉంది. 'జై సింహా' తో భారీ లాభాలను చవిచూసిన నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు. కన్నడ చిత్రం 'ముప్తీ' ని బాలయ్యతో రీమేక్ చేయబోతున్నాడట వినాయక్. బాలయ్యతో 'చెన్నవకేశవరెడ్డి' చిత్రం చేసాడు వినాయక్. ఈ సినిమా వచ్చి 16 సంవత్సరాలు అయ్యింది. ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ బాలయ్య, వినాయక్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట.