యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కొరటాల ఫ్రెండ్, డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన కూడా వచ్చింది. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. దాంతో కొరటాలతో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా వెనక్కి వెళ్లిపోయింది.
కాగా తాజా వార్తల ప్రకారం తదుపరి సినిమా విషయంలో కొరటాల శివ ఓ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. హీరో నానితో తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట కొరటాల. నానికి కొరటాల శివ ఓ కథ చెప్పాడట. ఈ కథ బాగా నచ్చడంతో నాని వెంటనే ఈ సినిమా చేద్దామని మాటిచ్చాడట. దాంతో ఈ సినిమాని నిర్మించే అవకాశాన్ని తన ఫ్రెండ్స్ మిక్కిలినేని సుధాకర్ ఇచ్చాడు కొరటాల. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్ నగర్ టాక్. సో... 'భరత్ అనే నేను' లాంటి హిట్ చిత్రం తర్వాత నానితో సినిమా చేయబోతున్నాడు కొరటాల. నాని పంట పండినట్టే కదా...!