యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకి సంబంధించి ఎగ్జయిటింగ్ ప్రకటన రాబోతోంది. అది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజునాడు రాబోతోంది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అంతకంటే సంతోషకరమైన వార్త ఏముంటుంది. ఈ వార్త నిజమేనా అని చాలామంది సందేహించే అవకాశముంది. కానీ ఈ వార్త నిజమేనని ఫిల్మ్ నగర్ టాక్.
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆ రోజున ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ కి సంబంధించి ఓ ఎగ్జయిటింగ్ ప్రకటన రాజమౌళి కాంపౌండ్ నుండి రానుందని తెలుస్తోంది. ఆ ప్రకటన కోసం వెయిట్ చేద్దాం. ఇదిలా ఉంటే...
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారట. సో... ఎన్టీఆర్ 35వ పుట్టినరోజుకి డబుల్ ట్రీట్ అన్నమాట... ఫ్యాన్స్ కి పండగే...!