నవదీప్, శ్వేతబసు ప్రసాద్ ఏదైనా కొత్త బిజినెస్ ఆరంభించారా అనుకునేరు. పబ్, రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగారా లాంటి అనుమానాలు కూడా కలుగుతాయి. ఇలాంటివేమీ చేయడంలేదుగానీ... అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ కోసం రంగంలోకి దిగారు.
'గ్యాంగ్ స్టార్స్' అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తోంది అమెజాన్ ప్రైమ్. ఈ వెబ్ సిరీస్ లో జగపతిబాబు నటిస్తుండగా... నవదీప్, శ్వేతబసుప్రసాద్ కూడా కీలక పాత్రలు చేసారు. తెలుగులో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ పోస్టర్ నిన్న విడుదలయ్యింది. ట్రైలర్ ఈ రోజు విడుదలవుతోంది. 'నేను రాజు నేనే మంత్రి' రైటర్ లక్ష్మీభూపాల్ ఈ వెబ్ సీరీస్ కి కథ అందించడంతో పాటు స్ర్కీన్ ప్లే సమకూర్చారు. ఫస్ట్ టైమ్ అమెజాన్ తో వెబ్ సిరీస్ కోసం చేతులు కలిపిన నవదీప్, శ్వేతబసు ఈ సిరీస్ కి వచ్చే రెస్పాన్స్ బట్టి ముందు ముందు వెబ్ సిరీస్ బిజినెస్ లోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. మరి అమెజాన్ 'గ్యాంగ్ స్టార్స్' ఏ రేంజ్ లో ఆన్ లైన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో వేచి చూద్దాం.