మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం షూటింగ్ యు.యస్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అనుఇమ్మాన్యువేల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి అనుఇమ్మాన్యువేల్ తప్పుకుంది. అను ఈ సినిమా నుంచి తప్పుకోవడం పట్ల రకారకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను అనుఇమ్మాన్యువేల్ చెప్పింది. ''శైలజా రెడ్డి సినిమా చేయడంవల్ల 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం యూనిట్ అడిగిన డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నాను. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకున్నాను'' అని చెప్పింది అనుఇమ్మాన్యువేల్. చిత్ర నిర్మాతలు సైతం మేము అడిగిన 50రోజుల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక అనుఇమ్మాన్యువేల్ మా సినిమా నుంచి తప్పుకుంది తప్ప... ప్రచారమవుతున్న రకరకాల వార్తల్లో నిజంలేదు అని స్ఫష్టం చేసారు. సో... ఏవో ఇష్యూల వల్ల అనుఇమ్మాన్యువేల్ ఈ సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు నిజంకాదు.