మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తయ్యింది. కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో రాంచరణ్ ఓ ప్లాన్ తో ఉన్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో తను నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి చిత్రం రిలీజ్ విషయంలో ఓ క్లారటీకి వచ్చిన తర్వాతే #RC12 రిలీజ్ గురించి ప్రకటించాల్సిందిగా నిర్మాత దానయ్య, డైరెక్టర్ బోయపాటిని కోరాడట చరణ్. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 'సైరా' ని విడుదల చేయడానికి సిద్ధమైతే, అప్పుడు ఈ యేడాది దసరాకి #RC12 విడుదలయ్యేలా చూసుకోవాలనుకుంటున్నాడట. లేకపోతే 'సైరా' ని వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తే, #RC12 ని సంక్రాంతి బరిలో నిలిచేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. సో... బోయపాటి, చరణ్ కాంబినేషన్ సినిమా విడుదల 'సైరా' తో లింక్ అయ్యుందని ఫిక్స్ అయిపోవచ్చు.