మెగా కుటుంబం నుంచి మరో హీరో తెరంగేట్రం చేయబోతున్నాడు . ఆ హీరో ఎవరో కాదు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. ఈ కుర్రాడిని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతోందనే వార్తలు గత కొన్నాళ్లుగా హల్ చల్ చేస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేయడానికి ఓ నిర్మాత ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.
'నేల టిక్కెట్' నిర్మాత రామ్ తల్లూరి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను నెత్తిన వేసుకున్నారట. 'అప్పట్లో ఒక్కడుండేవాడు' ఫేం సాగర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయట. వైష్ణవ్ తేజ్ ఆల్ రెడీ నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడట. డ్యాన్స్, ఫైట్స్ లో కూడా శిక్షణ తీసుకున్నాడని తెలుస్తోంది. సో... మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఈ హీరోకి వెల్ కమ్ చెప్పడానికి మెగాభిమానులు రెడీగానే ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.