గాయని సునీత గురించి పరిచయ వ్యాక్యాలు అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ పర్సనాల్టీ. గాయకురాలిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, ప్రోగామ్స్ కి హోస్ట్ గా.... తనని తానూ నిరూపించుకుని సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగిస్తోంది సునీత. అయితే వ్యక్తిగతంగా మాత్రం సునీత అంత ఆనందంగా లేదు. భర్తతో నెలకొన్న విభేదాలతో డివోర్స్ తీసుకుంది. సునీత కు ఓ బాబు, పాప ఉన్నారు. వారిద్దరి ఆలనాపాలనా తనే చూసుకుంటోంది. మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చెబుతూ వచ్చిన సునీత ఇప్పుడు మనసు మార్చుకుందని తెలుస్తోంది.
తన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న ఓ ఐటి కంపెనీ ఓనర్ ని పెళ్లి చేసుకోవడానికి సునీత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారమ్. ఇతను కూడా డివోర్సీనేనట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాలేదు. కాకపోతే ఇరువైపు పెద్దల అంగీకారంతో ఈ పెళ్లి జరగనుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ పెళ్లి అయినా సునీతకు సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుందాం.