అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు... పెళ్లి చేసేసుకున్నారు... పెద్దలు అంగీకారంతో ఇద్దరూ ఒకటవ్వబోతున్నారు... ప్రభాస్ ఇంట్లో ఒప్పుకోలేదు... అనుష్కకు వరుడిని చూస్తున్నారు... ఇలాంటి వార్తలు గత కొంతకాలంగా వింటూనే ఉన్నాం. ఈ మధ్య అయితే అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తల పట్ల అనుష్క తల్లి స్పందించారు.
ప్రతి తల్లికి ప్రభాస్ లాంటి కుర్రాడు నచ్చుతాడు. కానీ అనుష్క, ప్రభాస్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అలాంటప్పుడు వారు పెళ్లి చేసుకుంటారు అని ఊహించడం కరెక్ట్ కాదు. వారిద్దరి గురించి వదంతులు పుట్టించడం కరెక్ట్ కాదు. తెరపై ఇద్దరూ కలిసి బాగా నటిస్తారు. రియల్ లైఫ్ లో మాత్రం ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే. ఇకనైనా అనుష్క, ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టండి అని స్ఫష్టం చేసారు అనుష్క తల్లి. సో... అనుష్క, ప్రభాస్ పెళ్లి వార్తలు గాలి వార్తలేనని ఫిక్స్ అయిపోవచ్చు.