మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాభిమానులకు పండగలాంటి రోజు. తెరకెక్కుతున్న సినిమాల్లోని చిరు ఫస్ట్ లుక్ ను విడుదల చేసి, మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ఈ యేడాది చిరు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డి.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని చిరు పుట్టినరోజైన ఆగస్ట్ 22న కాకుండా, ఒక రోజు ముందు ఆగస్ట్ 21నే విడుదల చేయాలని 'సైరా' యూనిట్ ప్లాన్ చేసారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసారు. ఆగస్ట్ 21న ఉదయం 11.30 కి విడుదల చేయబోతున్నారు. అదిరిపోయే లెవెల్లో టీజర్ ని తీసుకురావడానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి వర్కవుట్ చేస్తున్నారట.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అవుట్ స్కర్ట్ లో జరుగుతోంది.