మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్టీఆర్' కి సంబంధించి రోజుకో వార్త బయటకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం తీసుకుంటున్న నటీనటుల గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది.
ఎన్టీఆర్ పాత్రను నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తోంటే, రానా దగ్గుబాటి చంద్రబాబునాయుడు పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ చిన్న అల్లుడు, పురంధీశ్వరీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర కోసం భరత్ రెడ్డిని తీసుకున్నారట. 'దూకుడు', 'అత్తారింటికి దారేది' చిత్రాల్లో భరత్ రెడ్డి మంచి పాత్రలు చేసాడు. ఇప్పుడు 'ఎన్టీఆర్' చిన్నఅల్లుడు పాత్ర చేయబోతున్నాడు. 1984 లో ఎన్టీఆర్ టిడిపి పార్టీ పవర్ లోకి రావడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా కృషి చేసారు. దీనికి సంబంధించిన సీన్స్ 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఉన్నాయట. త్వరలోనే భరత్ రెడ్డి పాల్గొనగా ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్.
సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలుగా బాలయ్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా థియేటర్స్ కి రానుంది.