'మహానటి' సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేష్ ని ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి సైతం కీర్తి సురేష్ ని తెగ పొగిడేసారు. కాగా కీర్తిసురేష్ ని తను చేయబోతున్న మల్టీస్టారర్ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటింపజేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఈ సినిమా కోసం తనను కాంటాక్ట్ చేయలేదని కీర్తి సురేష్ చెప్పడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
కానీ తాజా వార్తల ప్రకారం కీర్తి సురేష్ ఇటీవల రాజమౌళిని కలిసిందట. మల్టీస్టారర్ లో కీర్తి సురేష్ ని ఓ హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనతోనే రాజమౌళి ఆమెను తన ఆఫీసుకు రప్పించారని ఫిల్మ్ నగర్ టాక్. కీర్తి సురేష్, రాజమౌళి మధ్య చర్చలు జరిగాయని, ఆల్ మోస్ట్ ఆమె కన్ ఫార్మ్ అయ్యిందని తెలుస్తోంది. కాకపోతే కీర్తి రొమాన్స్ చేయబోయేది ఎన్టీఆర్ తోనా, లేక చరణ్ తోనా అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తం మీద కీర్తి సురేష్ కి బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు.