విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. వారాహి అధినేత సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ఈ చిత్రానికి సహ నిర్మాతలు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్ కి రానుంది.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా హక్కులను దక్కించుకోవడానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం భారీ ఆఫర్ ఇచ్చిందట. తాజాగా ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సినిమాస్ భారీ ఆఫర్ ఇచ్చి దక్కించుకుందట. నైజాం హక్కుల కోసం భారీ పోటీ నెలకొన్నప్పటికీ, ఈ సినిమాకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అందరికంటే ఎక్కువ కోట్ చేసి ఏషియన్ సినిమాస్ ఈ డీల్ ని ఫైనలైజ్ చేసిందని సమాచారమ్. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా ఉంటుందని జరుగుతున్న బిజినెస్ ని బట్టి అర్ధమవుతోంది. మరి ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాల్సిందే.