మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'RC12' చిత్రం షూటింగ్ నిమిత్తం అజర్ బైజాన్ లో ఉన్నాడు. అజర్ బైజాన్ లో రాంచరణ్ పాల్గొనగా భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇదిలా ఉంటే...
ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ నిమిత్తం 22 కోట్లు ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకి ఇంత భారీ ఆఫర్ రావడంతో ప్రస్తుతం స్టార్ హీరోలతో తెరకెక్కుతోన్న రెండు, మూడు సినిమాల నిర్మాతలు కూడా హిందీ రైట్స్ కోసం ఇదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారట. అయితే ఆ సినిమాలు 1, 2 కోట్లు తక్కువే పలుకుతున్నాయట. దీనికి కారణం చరణ్, బోయపాటి సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ కావడం, 4 యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీగా చిత్రీకరించడమేనని తెలుస్తోంది. ఒక్క హిందీ శాటిలైట్ హక్కుల కోసమే కాదు... ఈ సినిమా బాగా వర్కవుట్ అవుతుందనే లెక్కలతోనే సెన్సేషనల్ ఆఫర్స్ వస్తున్నాయట. మాస్ మసాలా సినిమాకున్న క్రేజ్ అది...!