'అరవింద సమేత - వీరరాఘవ' చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడనే వార్త బయటికి వచ్చింది. ఈ వార్త ఆల్ మోస్ట్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. అసలు ఈ వార్త నిజమేనా అనే అనుమానం కూడా అందరిలో ఉంది. అసలింతకీ ఆ వార్త ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...
'అరవింద సమేత - వీరరాఘవ' చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి ఎపిసోడ్ ఉందట. ఈ చైల్డ్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ నటించాడనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది. నిజంగానే అభయ్ రామ్ నటిస్తే... ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రియులు పండగ చేసుకోవడం ఖాయం.