యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత - వీరరాఘవ' చిత్రం దసరా కానుకగా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని జనాలు ఫిక్సయిపోతున్నారు. ఇక మాటల మాంత్రికుడు, ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే... ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందనే భావనతో ఉన్నాడట. ఇదిలా ఉంటే...
ఈ సినిమా స్పెషల్ షోలకు ఎన్టీఆర్ అభిమానులు భారీగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ 11 ఉదయం 4 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ షోలు పెద్ద ఎత్తున స్ర్కీనింగ్ కానున్నాయని సమాచారమ్. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తో ఎన్టీఆర్ బిజీ అయిపోతాడు. ఈ సినిమా థియేటర్స్ కి రావడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే 'అరవింద సమేత' రిలీజ్ ని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు ఫిక్స్ అయ్యారట. సో... సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయని చెప్పొచ్చు.