డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ ఫుల్ పంచ్ డైలాగులు, చక్కటి రొమాంటిక్ సీన్స్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ డ్రామా, కొంచెం కామెడీ, ఓ రొమాంటిక్ సాంగ్, ఐటమ్ సాంగ్, రెండు మాస్ బీట్ సాంగ్స్ తో ఫర్ ఫెక్ట్ పిక్చర్ ని తెరకెక్కించి అన్ని వర్గాల ఆడియన్స్ తో 'వావ్' అనిపించుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే షడ్రుచులతో విందు భోజనం చేసినట్టు ఉంటుంది. ఇక టైటిల్స్ విషయానికొస్తే...
'భద్ర', 'తులసి', 'సింహా', 'దమ్ము', 'లెజెండ్', 'సరైనోడు' అంటూ మాస్ ని కట్టిపడేసే విధంగా, పవర్ ఫుల్ గా ఉండే టైటిల్స్ ని ఇప్పటివరకూ తన సినిమాలకు పెడుతూ వచ్చిన బోయపాటి గత సినిమా నుంచి రూటు మార్చాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి చేసిన సినిమాకి 'జయ జానకి నాయక' లాంటి క్లాస్ టైటిల్ పెట్టాడు. అదే పంధాను కొనసాగిస్తూ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో చేస్తున్న సినిమాకి కూడా క్లాస్ టైటిల్ నే పెట్టాలనుకోవడం విశేషం, 'వినయ విధేయ రామ' టైటిల్ ని రాంచరణ్ సినిమా కోసం రిజిస్టర్ చేయించాడట బోయపాటి. ఇంత క్లాస్ టచ్ ఉన్న టైటిల్ కి మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ బాగుందని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వస్తున్న రెస్పాన్స్ బట్టి, బోయపాటి ఫైనల్ గా ఈ టైటిల్ పట్ల మొగ్గుచూపే అవకాశం ఉంది. రాంచరణ్ కూడా ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని చెప్పొచ్చు. టైటిల్ క్లాస్ గా ఉన్నప్పటికీ, బోయపాటి సినిమా పక్కా మాస్ గా ఉంటుంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి రాంచరణ్, బోయపాటి సందడి మాములుగా ఉండదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.