దసరా స్పెషల్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత - వీరరాఘవ' చిత్రం అక్టోబర్ 11న థియేటర్స్ కి వస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 94.25 కోట్లు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం పంపిణీ హక్కులను దక్కించుకున్న వారి వివరాలు ఈ విధంగా...
నైజాం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కృష్ణా - వారాహి మూవీస్
గుంటూరు - సుబ్బారావు - జయరాం
ఈస్ట్ - v3 ఎంటర్ టైన్ మెంట్స్
వెస్ట్ - ఎల్ వి ఆర్
సీడెడ్ - గంగాధర్
ఉత్తరాంథ్ర - ఏ.వి సినిమాస్
నెల్లూరు - అంజలి పిలింస్
కర్నాటక - బృంద అసోసియేట్స్
ఓవర్ సీస్ - ఎల్ ఎ తెలుగు
క్రేజీ ఆఫర్స్ తో 'అరవింద సమేత' పంపిణీ హక్కులు దక్కించుకున్న ఈ పంపిణీదారులు ఏ రేంజ్ లో లాభాలు చవిచూస్తారో వేచి చూద్దాం. భారీగా లాభాలు చవిచూడటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే వీరి పంట పండినట్టేనని చెప్పొచ్చు.