యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ సినిమా 'అరవింద సమేత - వీరరాఘవ'. రేపు (11.10.2018) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది. టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఎన్టీఆర్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఉమైర్ సంధు చెప్పేసారు. తన రివ్య్వూ, రేటింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు ఉమైర్ సంధు. ఆ వివరాల్లోకి వెళితే...
ఇండియన్ సినిమా మ్యాగజైన్ యుకె మరియు యుఎఇకి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు ఉమైర్ సందు. క్రిటిక్ సెన్సార్ మెంబర్ కూడా. తన ట్విట్టర్ ద్వారా సినిమా విడుదలవ్వకముందే సినిమా ఎలా ఉంటుందనే రివ్య్వూ, రేటింగ్ పోస్ట్ చేస్తారు. 'అరవింద సమేత' రివ్య్వూ కూడా పోస్ట్ చేసారు. 4 స్టార్ రేటింగ్ ఇచ్చి, బ్లాక్ బస్టర్ సినిమా ఇది అని ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ లుక్, క్యారెక్టర్ ని బ్యాలెన్స్ చేసుకుని ఎన్టీఆర్ ఈ పాత్రను ఆవిష్కరించిన విధానం సూపర్బ్ గా ఉంది. ముఖ్యంగా క్లయిమ్యాక్స్ లో ఎన్టీఆర్ నటన మాములుగా లేదట. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ పీక్స్ లో ఉండటంతో క్లయిమ్యాక్స్ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అవుతుందని ట్వీట్ చేసారు. త్రివిక్రమ్ తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని ఈ రివ్య్వూ బయటికి వచ్చిన తర్వాత జనాలు ఫిక్సవుతున్నారు. మరి 'అరవింద సమేత-వీరరాఘవుడు' ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో వేచి చూద్దాం.