టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో రానా, త్రిష ప్రేమలో ఉన్నారని, ఆ ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని వార్తలు ప్రచారమయ్యేవి. అయితే ఆ వార్తలు నిజమవ్వలేదు. ఇప్పుడైతే రానా, త్రిష మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఈ ఇద్దరి గురించి తప్పుడు వార్తలైతే ప్రచారమవ్వడంలేదు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆ సినిమా ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం '96'. ఈ సినిమా అక్టోబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. 1996 లో జరిగే లవ్ స్టోరీ నేపధ్యంతో తెరకెక్కిన సినిమా ఇది. కాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దాదాపు కోటి రూపాయలు ఇచ్చి దిల్ రాజు కైవసం చేసుకున్నారు. తమిళ్ వెర్షన్ కి హిట్ టాక్ రావడంతో ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి కొంతమంది హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారట.
ముఖ్యంగా రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడట. ఈ విషయం దిల్ రాజు వరకూ వెళ్లిందట. దాంతో రానా ని హీరోగా తీసుకుని త్రిషను హీరోయిన్ గా నటింపజేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. తమిళ్ వెర్షన్ లో త్రిష హీరోయిన్ గా నటించింది. అందుకే తెలుగు వెర్షన్ లో కూడా తననే తీసుకోవాలనుకుంటున్నారట. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ తెలుగు రీమేక్ తెరకెక్కనుందని తెలుస్తోంది. మరి ఫైనల్ గా రానా, త్రిష నే ఈ రీమేక్ లో నటిస్తారా వేచిచూద్దాం.