తొలి రోజు వసూళ్లు ఏ స్టార్ హీరోకైనా చాలా ముఖ్యం. భారీ ఓపినింగ్స్ సాధించడానికి ఎక్కువ థియేటర్స్, ఎక్కువ షోల స్ర్కీనింగ్ కి ప్లాన్ చేసి, ఫస్ట్ డే వసూళ్లను టార్గెట్ చేస్తుంటారు. నిన్న(11.10.2018) విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' కూడా ఫస్ట్ డే ఓపెనింగ్స్ భారీగా రాబట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్ సీస్ లో ఈ సినిమా భారీగా విడుదలయ్యింది. ప్రీమియర్స్ ద్వారా బాగా వసూళ్లు రాబట్టింది. యు.యస్ ప్రీమియర్స్ పరంగా టాప్ 10 స్థానాలను కైవసం చేసుకున్న చిత్రాల్లో 'అరవింద సమేత' చోటు దక్కించుకుంది. $800,000 వసూలు చేసి, 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రీమియర్స్ ద్వారా భారీగా వసూలు చేసి టాప్ 10 స్థానాలను కైవసం చేసుకున్న సినిమాల వివరాలు...
బాహుబలి 2 - $4,517,704
అజ్ఞాతవాసి - $1,521,438
బాహుబలి 1 - $1,364,416
ఖైదీ. నెం. 150 - $1,295,613
స్పైడర్ - $1,005,630
భరత్ అనే నేను - $850,000
అరవింద సమేత - $800,000
రంగస్థలం - $706,612
సర్ధార్ గబ్బర్ సింగ్ - $616054
జై లవ కుశ - $589,000