యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్. కాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
'జాన్' టైటిల్ ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారట. దీనికి సంబంధించి చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో, 'జాన్' టైటిల్ అయితే అన్ని భాషలకు కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. ప్రభాస్ 20వ సినిమా ఇది. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16 వరకూ ఇటలీలో ఈ చిత్రం షూటింగ్ జరగనుందని సమాచారమ్.