మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి అప్ డేట్స్ పెద్దగా బయటికి రావడం లేదు. కేవలం షూటింగ్ ఎక్కడ జరుగుతుందనే విషయం మాత్రమే బయటికి వస్తోంది. అయితే అభిమానులు రాంచరణ్ ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్స్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరు పుట్టినరోజు కానుకగా మెగాభిమానుల కోసం ఈ సినిమాలోని రాంచరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారని ఎదురుచూసారు. కానీ విడుదల చేయలేదు. కనీసం దసరా కానుకగా అయినా రాంచరణ్ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేస్తారని భావించారు. అదీ జరగలేదు. దాంతో మెగాభిమానులు చాలా నిరాశగా ఉన్నారని తెలుస్తోంది. కాగా తాజా వార్తల ప్రకారం రాంచరణ్, బోయపాటి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల విషయంలో ఓ క్లారటీకి వచ్చారని సమాచారమ్.
చిరంజీవి ప్రస్తుతం జార్జియా షెడ్యూల్ ని పూర్తి చేసారు. హైదరాబాద్ వచ్చేస్తున్నారు. వచ్చిన వెంటనే ఈ సినిమా కోసం రిజస్టర్ చేసిన టైటిల్ 'వినయ విధేయ రామ' కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, వెంటనే టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు రాంచరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. సో... చరణ్, బోయపాటి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదలవుతుందనే సస్పెన్స్ కి తెర పడాలంటే చిరు రావాల్సిందే. లెట్స్ వెయిట్ ఫర్ చిరు...!