'ఎన్టీఆర్' బయోపిక్ ఫస్ట్ పార్ట్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న డైరెక్టర్ క్రిష్ టైమ్ అసలు వేస్ట్ చేయడంలేదు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలను చేస్తున్నారట. ఇదిలా ఉంటే...
'ఎన్టీఆర్ - కథానాయకుడు' చిత్రంలో లెజెండ్ యాక్టర్ ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ 70 గెటప్పుల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా 'బొబ్బిలి పులి' చిత్రంలోని ఓ లెంగ్తీ డైలాగ్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' లో ఉందట. తండ్రి గెటప్ లో ఈ డైలాగ్ ని బాలయ్య సింగిల్ టేక్ లో చెప్పి అదరగొట్టేసారట. అప్పట్లో ఎన్టీఆర్ కూడా ఈ లెంగ్తీ డైలాగ్ కి సింగిల్ టేక్ తీసుకున్నారట. ఇప్పుడు బాలయ్య కూడా అదే సీన్ రిపీట్ చేయడంతో డైరెక్టర్ క్రిష్ తో పాటు యూనిట్ మొత్తం స్వీట్ షాక్ తిన్నారట. సీన్ పూర్తయిన వెంటనే బాలయ్యను అందరూ అభినందించారట. మరోవైపు రెండో పార్ట్ 'ఎన్టీఆర్ - మహానాయకుడు' షూటింగ్ కూడా చివరి దశలోనే ఉందట. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ రెండు పార్ట్ లు భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలతో అందరూ ఉన్నారు.