హీరోయిన్లు సమంత, నయనతార... ఇద్దరిలో ఎవరు ఆ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకోబోతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ ఇది. ఆ సినిమా ఏంటీ అనే వివరాల్లోకి వెళితే....
'సర్కార్' తో భారీ విజయాన్ని అందుకున్న ఇళయదళపతి విజయ్ తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది. విజయ్ తో 'తెరి', 'మెర్సల్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో విజయ్ తదుపరి సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా కోసం నయనతార, సమంతను పరిశీలిస్తున్నారట. విజయ్ హీరోగా తెరకెక్కిన 'విల్లు' చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ 'తెరి', 'మెర్సల్' చిత్రాల్లో సమంత హీరోయిన్ గా నటించింది. మరి ఫైనల్ గా ఈ ఇద్దరిలో ఎవరికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కుతుందో వేచిచూద్దాం.