సావిత్రమ్మగా నిత్యామీనన్, బి.సరోజాదేవిగా అనుష్క, ప్రభ పాత్రలో శ్రియ, జయప్రద పాత్రలో తమన్నా, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్... ఇలా 'ఎన్టీఆర్ - మహానాయకుడు' కోసం ఒకప్పటి లెజండరీ హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్న ఇప్పటి హీరోయిన్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఒక్కో పాత్రకి ఎంపిక చేస్తున్న నటీనటులు ఆ పాత్రలో ఎలా ఉంటారోననే ఆసక్తి అందరిలో ఉంది. లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్ 'బయోపిక్' లో భాగంగా ముందుగా విడుదలవ్వబోతున్న ఫస్ట్ పార్ట్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి రానుంది.
కాగా తాజా వార్తల ప్రకారం 'ఎన్టీఆర్ - మహానాయకుడు' లో లెజండరీ యాక్టరస్ కృష్ణకుమారి పాత్ర చేసే అవకాశం మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ కి దక్కిందని తెలుస్తోంది. ఎన్టీఆర్, కృష్ణకుమారి జంట చాలా బాగుంటుంది. ఈ ఇద్దరూ కలిసి చాలా మంచి సినిమాలు చేసారు. ఇద్దరి మధ్య చక్కటి కెమిస్ట్రీ ఉండేది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న బాలయ్య, కృష్ణకుమారి పాత్ర చేస్తున్న మాళవిక నాయర్ కాంబినేషన్ లో త్వరలో కొన్నిసీన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట డైరెక్టర్ క్రిష్. మరి ఇంకెంతమంది నటీనటులు ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగంకానున్నారో వేచిచూద్దాం.