యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' చిత్రం తమిళంలో విశాల్ హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ్ వెర్షన్ లో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా వార్తల ప్రకారం తమిళ్ వెర్షన్ కోసం ఐటమ్ గర్ల్ ని ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
తెలుగు 'టెంపర్' వెర్షన్ లో నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ చేసింది. తమిళ్ వెర్షన్ కోసం సన్నీలియోన్ ని తీసుకున్నారట. త్వరలోనే సన్నిలియోన్ పాల్గొనగా ఐటమ్ పాటను చిత్రీకరించబోతున్నారని సమాచారమ్. తెలుగులో 'గరుడ వేగ' చిత్రంలో అలరించిన సన్నిలియోన్ ఆ తర్వాత తెలుగు సినిమాలు కమిట్ అవ్వలేదు. ఇప్పుడు కోలీవుడ్ లో ఐటమ్ సాంగ్ చేయబోతోంది. మరి ఈ ఆఫర్ తో సన్నిలియోన్ మరికొన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుందేమో వేచిచూడాల్సిందే.