గన్ మిస్ ఫైర్ అయ్యింది.. రాజశేఖర్ కి గాయాలు అని చదవగానే కంగారుపడేరు. గన్ మిస్ ఫైర్ అయ్యింది నిజం. గాయాలు అయ్యింది నిజం. కాకపోతే భయపడాల్సిన గాయాలు రాజశే్ఖర్ కి తగలలేదు. ఆయన సేఫ్. గాయాలకు ట్రీట్ మెంట్ చేసి, రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్లు. ఇంతకీ ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే వివరాల్లోకి వెళితే...
రాజశేఖర్ ప్రస్తుతం 'కల్కి' చిత్రం చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. గన్ షూటింగ్ సీన్ ఒకటి ఉందట. విలన్ గ్యాంగ్ పై షూట్ చేసే సీన్ అట. ఈ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు గన్ మిస్ ఫైర్ అయ్యిందట. రియల్ గన్, బుల్లెట్స్ తో సీన్ చిత్రీకరించరు కాబట్టి, ఈ గన్ మిస్ ఫైర్ తో ఎలాంటి ప్రమాదం జరగలేదు. డమ్మీ గన్ బుల్లెట్స్ వాడతారు కాబట్టి, తలకు తగిలిన డమ్మీ బుల్లెట్ భుజానికి కూడా తగిలిందట. దీంతో సెట్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజశేఖర్ ని హాస్పటల్ కి తీసుకెళ్లారు. ఎలాంటి ప్రమాదంలేదని చెప్పి, రెస్ట్ తీసుకోమని చెప్పారట డాక్టర్లు. అయితే షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టంలేక, హాస్సటల్ నుంచి డైరెక్ట్ గా లొకేషన్ కి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారట రాజశేఖర్. వర్క్ పట్ల ఆయన డెడికేషన్ చూసి చిత్రం యూనిట్ పిధా అయిపోతోంది.